కమ్మర్పల్లి, ఏప్రిల్ 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నారని అన్నారు.
రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో దేశ రైతు కష్టాలను దూరం చేసేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు అండగా నిలబడాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, డీసీవో సింహాచలం, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ లోలపు గౌతమీ సుమన్, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధా రాజా గౌడ్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ సామ బాపు రెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, సర్పంచ్ ఇంద్రాల రూపా రాజేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బోగ అమర్, ఏవో లావణ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.