బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది..
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధుల సభ మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ ప్రధాని కుర్చీ ఖాళీ లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
- మోదీ, అమిత్‌షాకు కేసీఆర్ అంటే భయం
- అభివృద్ధి, సంక్షేమంపైనే నా దృష్టి
- కార్యకర్తలుండగా..ఎవరేం చేయలేరు..
- బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కమ్మర్పల్లి, ఏప్రిల్ 25 : అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధుల సభ మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ ప్రధాని కుర్చీ ఖాళీ లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. దేశంలో ఈ సారి రైతు ప్రభుత్వం రావాలని అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినదిస్తుంటే, కుర్చీ ఖాళీ లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ చెబుతున్న మాటలను దేశమంతా సానుకూలంగా ఆలోచిస్తుంటే అమిత్ షా ప్రధాని కుర్చీ గూర్చి మాట్లాడమేమిటన్నారు.ప్రధాని కుర్చీ ఎవరి జాగీరు కాదన్నారు. దేశానికి ప్రధానిగా రైతు కాకూడదా అని ప్రశ్నించారు. ప్రధానిగా అన్ని అర్హతలు ఉన నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభంజనం మొదలయ్యిందని, మహారాష్ట్రలో రైతులు కేసీఆర్ కోసం కదిలారన్నారు.
మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ఆయన కూతురు కవితను వేధిస్తున్నారు..కానీ టైగర్ కేసీఆర్, టైగర్ బిడ్డ కవిత భయపడే ప్రసక్తే లేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ఏకమై తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిదిన్నరేండ్లలో రూ.6,500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు లెక్కలతో సహా వివరించారు. అడ్రస్ లేని వాళ్లు, ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియని వాళ్లు తాను అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రూ.29లక్షలతో అత్యవసర ప్రతిస్పందన అంబులెన్సు వాహనాన్ని అందించానని, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ఆరేండ్లుగా స్వర్గ రథ వాహన సేవలు అందిస్తున్నానని, రూ.60 లక్షలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోర్తాడ్‌లో ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ నిర్మింపజేసి నియోజకవర్గంలో దవాఖానలన్నింటికీ ఆక్సిజన్ అందిస్తున్నానని గుర్తుచేశారు. తాను అందిస్తున్న ఉచిత స్వర్గరథ వాహనానికి డీజల్ ఖర్చుతో సమానం కాని ఆర్థిక సహాయం చేసి దానిని ప్రచారం చేసుకునే వారు తనను విమర్శించడం హాస్యాస్పదమేనని పేర్కొన్నారు.
హుందాగా రాజకీయాలు చేయాలని, లక్ష్యం గల వాడిని కాబట్టి మాట్లాడకుండా అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టానే తప్ప మాట్లాడాలనుకుంటే వారి కన్నా వంద రేట్లు మాట్లాడగలనని స్పష్టం చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండగా తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. అవినీతికి దూరంగా ఉంటూ మంచి పేరున్న నాయకులు, కార్యకర్తలు తన నియోజకవర్గ కార్యకర్తలని గర్వంగా చెప్పారు. 12 వందల కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవం, రూ.500 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్లు, రూ.130 కోట్లతో బీటీ రోడ్లు, రూ.163 కోట్లతో చెక్‌డ్యామ్‌లు, రూ.120 కోట్లతో సీసీ రోడ్లు, రూ.12 కోట్లతో గుడులు, 8,640 మందికి రూ.50 కోట్లతో సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ సేవలు, ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేశానని, ప్రతిపక్ష నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉదయం 10.30కు మొదలైన ప్రతిని ధుల సభ రాత్రి 7.30 వరకు కొనసాగింది. వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఎంపీ కేఆర్.సురేశ్ రెడ్డి, శాసనమండలి డిప్యూ టీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, డాక్టర్ మధు శేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, ఏఎంసి చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

