Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది.
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
గత నెల 30న రిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి రెండు వెంటిలేటర్లు, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు మాయమైనట్లు గుర్తించారు. మొత్తం నాలుగు పరికరాలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలోనూ చోరీలు.. 10 మందికి మెమోలు
రిమ్స్‌లో గతంలోనూ సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు సమాచారం. తాజాగా వెంటిలేటర్ల చోరీ ఘటనపై ఆస్పత్రి అధికారులు చర్యలకు దిగారు. డ్యూటీ వైద్యులు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 10 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై రిమ్స్ డైరెక్టర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అత్యవసర వైద్య పరికరాలకే భద్రత లేకపోవడంపై రోగుల బంధువులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

