Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Suspension | కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్లపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది.
Suspension | కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్లపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణల తీవ్రత ఆధారంగా నలుగురు విద్యార్థులను ఆరు నెలలు, మరో పది మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఒకేసారి 14 మందిపై చర్యలు తీసుకోవడం వైద్య కళాశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్ఎంసీకి ఫిర్యాదుతో వెలుగులోకి..
కళాశాలలో కొందరు సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు వారం రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులతోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతోపాటు, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై మంగళవారం కళాశాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్ వాల్యా, వివిధ విభాగాల అధిపతులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణలో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించాలని నిర్ణయించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
జూనియర్ల ఫిర్యాదుతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా తెలిపారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వివరించారు. కళాశాల ప్రాంగణంలోనైనా, హాస్టల్లోనైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

