Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
RaptaduIncident | అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Sandeep Reddy Vanga | అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలపై విమర్శలు గుప్పించారు. సినిమాల్లో చూపించే హింసాత్మక దృశ్యాల వల్లే సమాజంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయంటూ కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన సందీప్ రెడ్డి వంగా విమర్శకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సమాజంలో ఎప్పుడైనా ఇలాంటి భయానక నేరాలు జరిగినప్పుడు, మన మొదటి స్పందన బాధితుల పట్ల సానుభూతి చూపించడం, అసలు సమస్య ఏమిటో లోతుగా విశ్లేషించడం కావాలి. అంతేతప్ప, ప్రతిసారీ సినిమాలను సులభమైన బలిపశువులా (Scapegoat) మార్చడం సరికాదు” అని పేర్కొన్నారు. అలాగే, కొందరు ఈ విషాదకర ఘటనను కూడా తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ ఆందోళన అంతా బాధితుల కుటుంబాల గురించి కాదు.. ఒక ఘోరమైన విషాదాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి దీనిని ఒక మురికి అవకాశంగా మల్చుకుంటున్నారు” అని విమర్శించారు.
ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని కొందరి తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “కొందరు విఫలమైన నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఎప్పుడెప్పుడు ఎవరిపై విమర్శలు చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తామే ఏదో గొప్ప సామాజిక వేత్తలా బిల్డప్ ఇస్తూ ఇతరుల పనులపై పడతారు. ఇది సరికాదు అని మండిపడ్డారు. చివరగా.. ఒక విషాదం అనేది కేవలం సానుభూతిని మాత్రమే కోరుకుంటుంది కానీ, ఇలాంటి అవకాశవాదాన్ని కాదు. దయచేసి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి అంటూ తన పోస్టును ముగించారు.
When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema.
It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you’re using a horrific tragedy as a dirty excuse to settle your personal scores.
This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else’s work.A tragedy deserves empathy 🙏, not opportunism. Learn the difference.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

