Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Jagtial Child | జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ శిశు సంక్షేమ కేంద్రంలో చిన్నారి రోదించిన వీడియోతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఉత్తర్వులపై స్టే విధించి, చిన్నారిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును తీసుకుని పెంచుకుంటున్నారు. తల్లి మరణించిన ఆ చిన్నారిని తమ బిడ్డగానే భావిస్తూ అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అయితే ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ బంధువులు బాలుడి దత్తత చట్టబద్ధంగా జరగలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సెప్టెంబర్ 16న చిన్నారిని దంపతుల నుంచి తీసుకుని కరీంనగర్ శిశుగృహకు తరలించారు. దీంతో చిన్నారిని తమకు అప్పగించాలంటూ సరిత, శ్రీనివాస్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం అక్టోబర్ 16న బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పగింతలో జాప్యం జరగడంతో దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శిశుగృహలో చిన్నారిని కలిసేందుకు వెళ్లిన సమయంలో ‘డాడీ.. ఇంటికి తీసుకెళ్లు.. అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ బాలుడు రోదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసి చిన్నారిని దంపతులకు అప్పగించారు. దీంతో రెండు నెలలుగా బిడ్డకు దూరంగా ఉన్న ఆ దంపతుల ఇంట్లో ఆనందం నెలకొంది.
హైకోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ అభ్యంతరం
చిన్నారిని అప్పగించిన తర్వాత తాజాగా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారంలో కొత్త మలుపుగా మారింది. సీడబ్ల్యూసీ నిబంధనలు, అధికారులు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించకుండానే బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని కలెక్టర్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నంత మాత్రాన దానిని చట్టబద్ధమైన దత్తత ప్రక్రియగా పరిగణించవచ్చా? అనే అంశాన్ని పరిశీలించాలని కోర్టును కోరారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃపరిశీలించే వరకు బాలుడిని తిరిగి శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని కలెక్టర్ కోరారు. చిన్నారి తల్లిదండ్రుల వద్ద ఉంటే విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, చిన్నారిని తిరిగి సీడబ్ల్యూసీ సంరక్షణలోకి పంపాలని కోరుతూ కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

