వేల్పూర్/ముప్కాల్, డిసెంబర్ 23: బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురి నుంచి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం వేల్పూర్‌లో స్వీకరించారు.
నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వారితో చర్చించారు. ముప్కాల్ మండలంలోని నల్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుట్టి నర్సయ్య కుమారుడు పుట్టి ప్రశాంత్(32) ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని గురువారం రాత్రి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు.