MIM | శక్కర్ నగర్ : బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ తెలిపారు. బోధన పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మలక్పేట్ ఎమ్మెల్యే బల్లాల ఆదేశాల మేరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇట్టి కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాణస్వీకారం అనంతరం జలాలు బుకారి దర్గాలో చాదర్ సమర్పిస్థామని అన్నారు. ఈ కార్యక్రమం పట్టణంలోని రాకాసిపేట్ట్ లోని మర్హబా ఫంక్షన్లో నిర్వహిస్తామని, ఉదయం నిర్వహించే ఇట్టి కార్యక్రమానికి ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ ఆలీ తో పాటు నాయకులు అహ్మద్ బిన్ మోసిన్, హబీబ్ ఖాన్, ఖదీర్,అబ్దుల్ అల్తాఫ్, సమీర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.