– శ్రీ సద్గురు సోమాయప్ప స్వామీజీ
పోతంగల్, జనవరి 30 : భగవంతుడి నిరంతర నామస్మరణతో మనసులోని ఆందోళన తగ్గి, ప్రశాంతత లభిస్తుందని శ్రీ సద్గురు సోమాయప్ప స్వామీజీ అన్నారు. పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో శుక్రవారం అఖండ శివనామ సప్తహం కార్యక్రమం ముగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సద్గురు సోమయప్ప స్వామీజీ హాజరయ్యారు. సప్తహం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో భక్తులు ఏడు రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహా అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా ప్రతీ ఏటా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిఠాధిపతి భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిలింగప్ప మహరాజ్, భక్తులు పాల్గొన్నారు.