ఖలీల్‌వాడి/కోటగిరి/నందిపేట్, మే 20: ఆన్లైన్లో ముందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూc విజయవంతమైంది. ఎలాంటి మందుల చీటీలు లేకుండా ఆన్లైన్లో మందులు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగిస్ట్స్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో మెడికల్ షాపులు మూతబడ్డాయి.
నిజామాబాద్, కామారెడ్డి, కోటగిరి, పోతంగల్, నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, పిట్లం, ఎల్లారెడ్డి సహా పలు మండలాల్లో మెడికల్ షాపుల నిర్వాహకులు నిరసనలు తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేయడం వల్ల ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ ఫార్మసీల పేరుతో చిన్న మెడికల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.