నందిపేట్, ఫిబ్రవరి 24 : మండలంలోని బజార్‌కొత్తూర్ గ్రామానికి చెందిన బీజేపీ, టీడీపీ, బీఎస్పీలకు చెందిన పలువురు నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరగా… ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రచ్చ లక్ష్మణ్, తూర్పు రవి, టీడీపీ నుంచి మాగంటి బాబాగౌడ్, ఆత్రం సాయిలు, బీఎస్పీ నుంచి కలిగోట్ సంతోష్ టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గోపు ముత్యం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాబురాజ్, పిప్పెర శ్రీను, గణేశ్, సాయారెడ్డి, సాగర్, భోజన్న, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ, ఫిబ్రవరి 24 : మండలంలోని అంబారీపేట గ్రామానికి చెందిన బీజైవైఎం మాజీ అధ్యక్షుడు బెంజిరం నవీన్‌రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ విప్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఫిరంగి రాజేశ్వర్, నాయకుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.