కోటగిరి డిచ్పల్లి/నందిపేట్/మాక్లూర్, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుంకిని సర్పంచ్ మాధవ్‌రావు అన్నారు. గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన గురువారం పరిశీలించారు. 150 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ శ్రీలత తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దిగంబర్, ఎంపీటీసీ సాయిలు, అంగన్వాడీ టీచర్లు కల్పన, శ్రీప్రియ, ఏఎన్ఎం సవిత, రాజమణి, ఆశ కార్యకర్తలు పుష్పలత, శశికళ, రేష్మ, సిబ్బంది రాజేశ్వరి, జ్యోతి పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కుంచాల విమలారాజు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగామణీ గంగాధర్, ఉపసర్పంచ్ గంగామణీ సంతోష్, వైద్యాధికారి నయన, నేత్ర వైద్య నిపుణులు సిద్ధిఖీ, ధనలక్ష్మి, ఖవి పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ సుబ్బారావు ప్రారంభించారు. వైద్యులు శ్రీరాంయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని తల్వెద గ్రామంలో 175 మందికి వైద్యురాలు అరుణ కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది భాస్కర్, దేవన్న, ఆప్తామెట్రిస్ట్ అపురూప, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో 190 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్య నిపుణుడు బొప్పారం నరేశ్ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ ప్రవీణ, ఏఎన్ఎం సంధ్య పాల్గొన్నారు.