Maha Annadanam | కంటేశ్వర్, సెప్టెంబర్ 3 : టీజీ ఎన్పీడీసీఎల్డీ-2 సెక్షన్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ గణేష్ మండలి వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీ-2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నామని, విద్యుతు ఉద్యోగులు కార్మికులు ప్రతీ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని 1104 అధ్యక్షుడు రఘునందన్ తెలిపారు.
విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో కార్మికులకు ఉద్యోగస్తులకు ఎవరికి ప్రమాదాలు జరగకుండా, వినియోగదారులకు మంచి సేవలు అందించే విధంగా వినాయకుడు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాపల్లి రవీందర్ ఎస్ఈ ఆపరేషన్ నిజామాబాద్, అల్జాపూర్ రమేష్, ఎం శ్రీనివాస్, డీ వెంకటరమణ, కామేశ్వరరావు, పట్టణ-2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి, ఏడీఈలు తోట రాజశేఖర్, 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షుడు రఘునందన్, ఈశ్వర్, జూనియర్ అసిస్టెంట్ రవి, ఏఎల్ఎం వివిధ సంఘాల నాయకులు మన్మోహన్, సురేష్ కుమార్, బాలేష్ కుమార్, రాజేందర్ రెడ్డి, కాశీనాథ్, శివాజీ గణేష్, నాంపల్లి, సతీష్ కుమార్, గంగారాం నాయక్, శ్యామ్, చంద్రశేఖర్, మల్లేష్, పోశెట్టి, సుమిత, సునీత, బాబా, శ్రీనివాస్, బాలరాజ్, నర్సారెడ్డి, శ్రీనివాస్, నగేష్, డీ-2 సెక్షన్ సిబ్బంది సతీష్ కుమార్, రామకృష్ణ, రాజయ్య, సంయోద్దీన్, సాయికుమార్, రాంగోపాల్, రామకృష్ణ, ప్రవీణ్, కృష్ణ, చరణ్, శంకర్, మోహన్, అశోక్, పవర్ హౌస్ ఉద్యోగులు, కార్మికులు 500 మంది పాలుపంచుకున్నారు.