కామారెడ్డి : కామారెడ్డి (Kamareddy) మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చి లారీ ఢీకొట్టింది.
దీంతో ఆటో బోల్తా కొట్టింది . సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ (Auto Driver) అంకం నరేందర్ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.