కమ్మర్పల్లి, జనవరి 1 : కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సంతరించుకొని మరింత అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంబంధిత శాఖ అధికారులు, అనధికార ప్రముఖులు, బీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల శర్మ, ఆర్ అండ్‌బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, న్యాక్ డీజీ భిక్షపతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ రమేశ్ రెడ్డి, ఆర్ అండ్‌బీ సీఈలు, సిబ్బంది తదితరులు మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
న్యాక్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్ అండ్ బీ న్యాక్ నూతన క్యాలెండర్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ శాంతులు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ప్రతి పనిలో విజయం వరించాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మరింత పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయనున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో నిలుస్తూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణను మరింత సుసంపన్నం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి బాసటగా నిలువాలని, రాష్ట్ర అబివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అభివృద్ధి పనులను వివరించిన ఏర్గట్ల నాయకులు
ఏర్గట్ల,జనవరి 1 : మండలంలోని బట్టాపూర్ గ్రా మానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హైదరా బాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గం గారాం నాయక్, మండల నాయకులు కట్కం పద్మాసాగర్ రెడ్డి, చిలుక కిషన్, నరేందర్ యాదవ్, సామంత్ రెడ్డి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూతు రు చిన్న సాయన్న, రైతు బంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు మాస్ గంగాధర్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, నాయకులు చిన్న గంగాధర్, శ్రీధర్ గౌడ్, యుగేంధర్ తదితరులు ఉన్నారు.