Drug-free society | వినాయక నగర్, జూన్ 16 : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు గంజాయి, మత్తు పదార్థ రహిత సమాజం కోసం వినూత్నంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి ఆధ్వర్యంలో ఎస్సై మొగులయ్య సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో గంజాయి మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రచారం నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మత్తుకు బానిసగా మారి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని వారు అన్నారు. మత్తు పదార్థాలను వినియోగించడం, సరఫరా చేయడం చట్టరీత్య నేరమని వారు పేర్కొన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు దృష్టికి వస్తే ప్రజలు వెంటనే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు సమాచారం అంది ఇవ్వాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో ఏఎస్సై హబీబ్, హెడ్ కానిస్టేబుల్ సలీం, సిబ్బంది అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.