బాన్సువాడ, నవంబర్ 26: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర ముఖ్యమైనదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహా రం క్షేత్రస్థాయిలో అందించే బాధ్యత అంగన్వాడీ, ఆశ కార్యకర్తలదే అని పేర్కొన్నారు. ప్రాథమిక అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ముందస్తుగానే చికిత్స తీసుకొని నయం చేసుకోవచ్చని అన్నారు. ఆరో గ్యవంతులుగా తీర్చి దిద్దే బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులుగా ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలపై ఉందన్నారు. కేసీఆర్ కిట్ ద్వా రా ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడి తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రసవం తర్వాత కూడా పౌష్టికాహారం అందించే ఏకైన ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు.
డెలివరీ తర్వాత దవాఖాన నుంచి రూపా యి ఖర్చు లేకుండా ఇంటివరకు ఉచితంగా అమ్మ ఒడి వాహనంలో చేరవేస్తారని, దేశంలో ఇది ఎక్కడా లేదన్నారు. గతంలో వంద శాతం మంత్రసానీల ఆధ్వర్యంలోనే సుఖ ప్రసవాలు జరిగేవని, ప్రస్తుత పరిస్థితుల్లో సిజేరియన్లు పెరిగాయన్నారు. కొంతకాలంగా 80 శాతంగా ఉన్న సీరిజయన్లు 40 శాతానికి తగ్గిందన్నారు. దీనిని జీరో శాతానికి తీసుకురావాలని ఆయన సూచించారు. డిసెంబర్ నెల నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కూడా అందిస్తారని చెప్పా రు. డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.