పోతంగల్ ఆగస్టు 26 : మట్టి వినాయకుడి ప్రతిమ ఏర్పాటుతో పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతమని స్వామీ వివేకానంద యూత్ అధ్యక్షుడు సితలే మోహన్ అన్నారు. మంగళవారం స్వామి వివేకానంద యూత్ అధ్వర్యంలో పోతంగల్ మండల కేంద్రంలోనీ జిల్లాపరిషత్ పాఠశాలలోనీ విద్యార్థులతో మట్టి గణపతి తయారు చేయించారు. తయారు చేసిన విగ్రహాలకు ప్రథమ ద్వితీయ బహుమతులను అందజేశారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని విద్యార్థులకు వివరించారు. వినాయక చవితి పండుగ సందర్బంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, ప్రధాన ఉపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయ బృందం వివేకానంద యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.