Leopard | నాగిరెడ్డి పేట్ : నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాండూరు శివారులోని పౌల్ట్రిఫామ్ నుంచి జాతీయ రహదారిని దాటులోని శనివారం ఉదయం ధర్మారెడ్డి బీట్ అడవిలోకి చిరుత వెళ్లినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు.
దీంతో అక్కడకు అటవీ ప్రాంతంలో పరిశీలించగా చిరుత పులి పాద ముద్రలు (Pug marks), విసర్జీతం (Scotts) గుర్తించినట్లు చెప్పారు. కావున చిరుత పులి ఉన్నట్టు నిర్ధారించామని చెప్పారు. అందువల్ల అటవీ ప్రాంత సమిపంలో గల తాండూర్, ధర్మారెడ్డి, బంజార తాండ , లింగం పల్లి. గ్రామాల ప్రజలు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటలవరకు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రవికుమార్, బీట్ అధికారులు నవీన్‌కుమార్, గోపాల్ పాల్గొన్నారు.