జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 1: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ శివారులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత మృతి చెందింది.
జక్రాన్‌పల్లి ఎంపీడీవో సతీశ్‌కుమార్ విధులు ముగించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో నిజామాబాద్‌కు వెళ్తుంగా, పడకల్ శివారులోని జాతీయ రహదారిపై చిరుత పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.