నిజామాబాద్ : ఆర్మూర్ పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను(Central budget) వామపక్షాల నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ మాట తప్పిందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యా, వైద్య రంగంలో నిధులు ఎక్కువగా కేటాయించాలన్నారు.
బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు పట్టం కట్టేలా ఉందని విమర్శించారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పోరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.