Banswada | బాన్సువాడ, జులై 24 : బాన్సువాడ నియోజక వర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు, నాయకులు, కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల విద్యార్థుల పట్ల చేస్తున్న అరాచకాలను దృష్టిలో ఉంచి, తన జన్మదిన వేడుకలను శుక్రవారం నిరాడంబరంగా జరుపుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అందులో భాగంగా సాదాసీదాగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు షేక్ జుబేర్, మాజీ రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నా కుమారులు సంయుక్తంగా తెలిపారు. వేడుకల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు మొక్కల పంపిణీ, సంగమేశ్వర కాలనీలో కౌన్సిలర్ సహకారంతో చిన్నారులకు కుర్చీల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, యువకులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, రక్త దానం చేశారు.