బోధన్/ ఏర్గట్ల/ నందిపేట్/ మాక్లూర్/ రెంజల్/ నవీపేట/ డిచ్పల్లి/ ఇందల్వాయి /సారంగాపూర్, సెప్టెంబర్ 17: హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశాయి. డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్, సాంబార్ మోహన్, శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, పద్మారావు, లింగం, రమాకాంత్, శ్రీనివాస్, పుప్పాల గీత, యేసుమణి పాల్గొన్నారు. రూరల్ మండలంలోని మల్లారంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
పార్టీ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మాజీ సర్పంచ్ నగేశ్ పాల్గొన్నారు. బోధన్ గంజ్ రోడ్డు కమాన్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సెల్ సభ్యుడు పెర్క రామకృష్ణ, బీఆర్ఎస్ బోధన్ పట్టణ కార్మిక విభాగం అధ్యక్షుడు రవిశంకర్‌గౌడ్ తమ పిల్లలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఏర్గట్ల బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం, మాజీ ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ సింగసారం గంగారాం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నందిపేట్‌లోని వెల్మల్ చౌరస్తాలో తల్లి తెలంగాణ విగ్రహానికి పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల లసాగర్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజన్న, సీనియర్ నాయకుడు బాలగంగాధర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని బోర్గాం(కె) గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు సుక్కి సుధాకర్, గోపు రంజిత్, తిరుమల నర్సాగౌడ్, మేకల గంగాధర్, అశోక్, శ్రీధర్, గంగాధర్‌గౌడ్, కృష్ణ, మహేశ్, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.
రెంజల్ మండల కేంద్రంలో తెలంగాణతల్లి విగ్రహానికి పార్టీ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, తెలంగాణ శంకర్, నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. నవీపేట మండల కేంద్రంలో పార్టీ నాయకులు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్‌కుమార్, సౌద శ్రీనివాస్, గైని సతీశ్, లోకం నర్సయ్య, పీతంబర్, శ్యామ్ తదితరులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.