silver jubilee celebration | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లోని ఎల్కతుర్తి జరిగే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఆదివారం ఉదయమే నాయకులు తమ తమ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రం చేరుకొని కోటగిరి మండల బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్ ఆధ్వర్యంలో కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కోటగిరి మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, సమీర్, సూదం నవీన్, సుజాత దేవేందర్, ఫారుక్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, చిన్న అరవింద్, పాల గంగారం తదితరులు ఉన్నారు.