కంఠేశ్వర్, ఏప్రిల్ 12: తెలంగాణ యూనివర్సిటీ లో రెండో సెమిస్టర్ చదువుతున్న కె.కీర్తనకు పార్లమెంట్లో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్-2022 నుంచి నిర్వహించే ‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో భాగం గా ఈనెల 14న ‘ఆజాదీ కా అమృత్ మ హోత్సవ్’ నిర్వహించనున్నారు.
ఇందులో భాగం గా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పార్లమెంట్లో మా ట్లాడడానికి రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక విద్యార్థిని కీర్తన కావడం విశేషం. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలపై ఆమె మాట్లాడనున్నది. టీయూ వీసీ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ కె.అపర్ణ, ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.