గాంధారి, జనవరి 22: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశమే ఫిదా అవుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని చెన్నాపూర్, మేడిపల్లి గ్రామాల్లో నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. చెన్నాపూర్‌లో పది, మేడిపల్లిలో ఐదు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతోపాటు రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కావడంతో పేదలు సంతోషం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమం లో జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, చెన్నాపూర్, మేడిపల్లి సర్పంచులు గీతా శ్రీకాంత్‌రెడ్డి, నారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీరావు, గాంధారి విండో చైర్మన్ సాయికుమార్, సర్పంచులు మమ్మాయి సంజీవ్, అబ్దుల్ ఫారూఖ్, పిట్ల కళావతీ లక్ష్మణ్, ఎంపీటీసీలు సింగసాని సుమిత్రా శ్రీనివాస్, ఉమారాణీ అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డిరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, నాయకులు ముకుంద్‌రావు, తాడ్వాయి సంతోష్, బెజుగం సంతోష్, గంగాధర్, సంజీవ్ పాల్గొన్నారు.