నిజామాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై దేశ ప్రయోజనాల కోసం భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఎన్నో ఆటుపోట్ల నడుమ 60 ఏండ్ల ప్రజల కలను నిజం చేసి ప్రత్యేక రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా, రెండోసారి ప్రభుత్వాధినేతగా గెలిచి నిలిచిన కేసీఆర్ అడుగులు ఇక గోల్కొండ నుంచి ఎర్రకోట వైపునకు పడుతున్నాయి. జలదృశ్యంలో పిడికెడు మందితో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నేడు 283 మంది కీలక ప్రతినిధుల సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఈ చారిత్రక ఘట్టానికి హాజరయ్యేందుకు ఆహ్వానం అందిన ని జామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లా రు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్గా బుధవారం మ ధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు మి న్నంటాయి. గులాబీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప టాకులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ గులాబీ జెండాలను చేతబట్టి సం బురాలు చేసుకోగా పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.
సెప్టెంబర్ 5… అక్టోబర్ 5…
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గత నెల 5వ తా రీఖు నాడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చా రు. సరిగ్గా నెల రోజులకు అక్టోబర్ 5న దసరా పర్వదినం రోజే జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను మారు స్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించారు. అయితే జాతీయ రాజకీయాలపై నిజామాబాద్ సభా వేదికపై కేసీఆర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇందూర్ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత కరెంట్ అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం ద్వారా ఇందూరు కీర్తి చరిత్రపుటల్లో చేరింది. అంతేకాకుండా ఉద్యమ సమయంలో వెన్నంటి నిలిచిన ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదాన్ని సైతం కేసీఆర్ స్వీకరించారు. సెప్టెంబర్ 5న కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ కాకతాళీయంగా సరిగ్గా నెల రోజులకే జాతీయ పార్టీగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా ఆవిర్భవించడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఉద్యమ సమయం లో కేసీఆర్‌కు ఇందూరు సెంటిమెంట్ చాలా కలిసి వచ్చింది. నేషనల్ పాలిటిక్స్‌లోనూ ఈ పంథా కొనసాగుతుందని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమం…
2014లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి ఆచరణలో పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు ఆలోచించని అనేక వినూత్న పథకాలకు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా ప్రజల దీవెనతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేసింది. 2014లో కేం ద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ దేశంలో తమ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలన్న కుట్రల లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి అనేక రాష్ర్టాల్లో అక్రమంగా అధికారాన్ని గుం జుకుంటూ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. రాష్ర్టాలను సంప్రదించకుండా అనేక రంగా ల్లో ప్రజా వ్యతిరేక సంస్కరణలు తీసుకు వస్తూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ పా ర్టీ చేతులెత్తేసిన దరిమిలా యావత్ దేశానికి ఇప్పు డు కేసీఆర్ ఒక చుక్కానిలా నిలువబోతున్నారు.
పండుగ వేళ బీఆర్ఎస్ చర్చ…
దసరా పర్వదినం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన బీఆర్ఎస్ ప్రకటనపై ఒకటే చర్చ జరుగుతోంది. జనం గుమిగూడిన చోట ఇదే విషయంపై జోరుగా మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర, బీజేపీతో బీఆర్ఎస్ ఢీకొట్టేందుకు గల శక్తియుక్తులపై సర్వ త్రా చర్చించుకుంటుండడం కనిపించింది. జాతీ య పార్టీని స్థాపించడం మామూలు విషయం కా దు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా పెట్ట డం కేసీఆర్‌కే సాధ్యం అవుతుంది. జాతీయ పార్టీ ఎజెండా ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్త సమస్యలను ఆకాంక్షలను సరైన రీతిలో ప్రతిబింబించి వాటి కోసం నిలబడితే ప్రజల దీవెనలు తప్పకుం డా ఉంటాయి. జాతీయ పార్టీపై భిన్నాభిప్రాయా లు రావడం సహజం. వాటికి జవాబు భవిష్యత్తు కార్యాచరణ చెప్తుంది.
పట్టు వదలని విక్రమార్కుడు కేసీఆర్
ఎల్లారెడ్డి, అక్టోబర్ 5 : కేసీఆర్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే…ప్రాణం పోయినా వెనక్కి తగ్గని మనిషి.2001లో టీఆర్ఎస్ను స్థాపించినప్పుడు నేను మూడు సంవత్సరాలు వెన్నంటి ఉన్నాను. పార్టీని ఎలా నడపాలనే విషయంలో ఆయనకు స్పష్టత ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలి…ఎలా చేయాలి…ఎవరిని కలవాలి అనే విషయాల్లో ఆయనను కనీసం అంచనా కూడా వేయలేం. ఇప్పుడు బీఆర్ఎస్గా ఆవిర్భావం మాత్రమే జరిగింది. 2024 వరకు దాని రూపం మారి జాతీయ రాజకీయాలను పూర్తిగా శాసిస్తుంది.
– జాజాల సురేందర్,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
సర్వత్రా హర్షం..
బాన్సువాడ, ఆక్టోబర్ 5 : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న 24 గంటల నిరంతర విద్యుత్‌ను దేశవ్యాప్తంగా అందిప్తామని ఇది వరకే చెప్పారు. పేదలు, రైతుల బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్. రాబోయే రోజుల్లో భారత్ రాష్ట్ర సమితి పాలన కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్న.
– పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
చారిత్రాత్మకమైన రోజు..
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడం దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన రోజు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సకల జనులను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ సీఎం కేసీఆర్. నేడు దేశం బీజేపీ పాలనో అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్తో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందనే భరోసా అందరిలో ఏర్పడింది.
-హన్మంత్ షిండే, జుక్కల్ ఎమ్మెల్యే
దేశ రాజకీయాల్లో సమూల మార్పులు
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీని స్థాపించడంతో దేశ రాజకీయాల్లో ఇక పై సమూల మార్పులు రానున్నాయి. భారత దేశం ఒక గొప్ప దార్శనికుడి నాయకత్వాన్ని చూడబోతున్నది. ఇప్పటివరకు దేశంలో మత రాజకీయాలు నడిచాయి. మతాలకతీతంగా యావత్తు దేశం అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇది దేశానికి శుభ పరిణామం. కేంద్రలోని నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే శక్తి మా కేసీఆర్ సార్‌కు ఉంది.
– మహ్మద్ షకీల్ , బోధన్ ఎమ్మెల్యే
నవ శకానికి నాంది భారత్ రాష్ట్ర సమితి
బీఆర్ఎస్ నవ శకానికి నాంది పలుకుతుంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్.. రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపింది. పేదలు, రైతులు రెండు కండ్లుగా పాలన అందించిన కేసీఆర్ నాయకత్వాన్ని భారత ప్రజలు కోరుకుంటున్నారు. లౌకిక దేశంలో మత విద్వేషాలను నింపుతున్న బీజేపీ, మోదీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. అందుకే కేసీఆర్ లాంటి నాయకుడిని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ మోడల్‌ను దేశమంతా కోరుకుంటున్నది. ఇలాంటి సమయంలో భారత్ రాష్ట్ర సమితితో కేసీఆర్ రావడం హర్షణీయం.
-వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
కేసీఆర్‌తోనే దేశం అభివృద్ధి బాట పడుతుంది
కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని యావత్ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశ రాజకీయాల్లోనూ రాణించడానికి తోడ్పడుతాయి. దేశం లోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. ఈ పథకాలన్నీ దేశ వ్యాప్తం కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎక్కడా లేవు. అది ప్రస్తుతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి
దేశానికి దిశానిర్దేశం చేసేది కేసీఆర్
రాష్ట్ర రాజకీయాలపై అపారమైన అనుభవం, పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోనూ సత్తా చాటగలరు. 14 ఏండ్ల పాటు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృషి చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేసీఆర్ కృషి చేయగలరు. కేంద్రంలో బీఆర్ఎస్ను స్థాపించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి
కేసీఆర్‌తోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవడంతో పాటు అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. కేసీఆర్ ప్రస్తుతం ప్రకటించిన బీఆర్ఎస్తోనే దేశంలో ప్రగతి సాధ్యమవుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తరహాలో నే దేశాన్ని సైతం నడపడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది.
-ఆశన్న గారి జీవన్‌రెడ్డి, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే
అందరి కండ్లల్లో ఆనందం..
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడంతో అందరి కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. దేశంలోని రైతులు అభివృద్ధి చెందలాంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టమైపోయింది. దేశం అభివృద్ధి చెందాలన్నా.. రైతుల కండ్లల్లో ఆనందం ఉండాలన్నా, సంక్షేమ పథకాలు అందలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే.
-బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ఇక దేశవ్యాప్తంగా సంక్షేమ ఫలాలు..
దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి వచ్చిందటే ప్రజల కష్టాలు దూరమవుతాయనే భరోసా అందరిలో ఏర్పడింది. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. కేసీఆర్ దేశ ప్రధాని కాగానే తెలంగాణ మోడల్ దేశమంతా అమలవు తుంది.
-దాదన్న గారి విఠల్‌రావు, నిజామాబాద్ జడ్పీ చైర్మన్
ప్రజల ఆదరణ, అభిమానం కేసీఆర్ వెంటే..
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్తో రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రజలందరూ సంబురాలు జరుపుకొంటున్నారు. ప్రజల ఆదరాభిమానాలు కేసీఆర్ వెంటే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ రాష్ర్టాన్ని ఇతర రాష్ర్టాల కన్నా ముందంజలో ఉంచారు. రానున్న రోజుల్లో ప్రధానిగా కేసీఆర్ దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు.. ఆ సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉంది.
-దఫేదార్ శోభారాజు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్