నిజామాబాద్, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) జన్మదిన వేడుకలను నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్‌కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ (Gampa Goverdhan) నివాసం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆయన ఇంటి వద్ద మొక్కలు నాటారు.
మాచారెడ్డిలో ..
మాచారెడ్డి (Machareddy) మండలంలోని అక్కాపూర్ గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలచంద్రం ఆధ్వర్యంలో భారీ కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో సీఎంగా సారే రావాలని ఆకాంక్షించారు.
మద్నూరులో..
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండలంలోని మేనూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చౌడమ్మ ఆలయంలో..
నిజామాబాదు జిల్లా నందిపేట్ (Nandipet) మండలంలోని చౌడమ్మకొండూరు ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం కేకే కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
మోర్తాడ్‌లో..
మోర్తాడ్ (Morthad) మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కళ్యాణ్ అశోక్, వైస్ చైర్మన్ నవీన్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, చిన్న రాజేశ్వర్, భోగా ఆనంద్, గంగారెడ్డి, భూమారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు .
బోధన్ మండలంలో..
బోధన్ రూరల్ : మండలంలోని ఏరాజ్‌పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గిర్దావర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపు కోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్, కోట గంగారెడ్డి, భవానీపేట్ శ్రీనివాస్, గణేష్ పటేల్, హన్మంతు, గోపాల్, పూలెందర్, రామయ్య, దత్తు పటేల్, కమలాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్, బీర్నూర్ మండలాల్లో..
నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేశారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో టపాకాయలు కాల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు మోచి గణేష్, నర్సింలు గౌడ్, అప్రోజ్,, మేకల రాములు, సాయికుమార్, ఆనంద్ గౌడ్, శ్రీను, రమేష్, అల్లం రాములు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ..
ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు.
ఆలూరులో..
ఆలూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గత పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యిందని ఆరోపించారు.
బాల్కొండలో..
బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి , ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు సాగర్ యాదవ్, షాహిద్, ఫయాజ్ అలీ, ఇఫ్తేఖార్, కన్న పోశెట్టి, రామ్ రాజ్ గౌడ్, రహీంఉద్దీన్, జాకీర్, రాజేందర్, ఆరిఫ్, శ్రీనివాస్, రాజేశ్వర్, రాజలింగం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి, పోతంగల్ లో ..
తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన మహానేత , ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజా నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని యువ నాయకులు నవీన్,ఫారూఖ్, సమీర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అమ్మ అనాధ ఆశ్రమంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంచారు. మొక్కలను నాటారు.
వారు మాట్లాడుతూ కేసీఆర్ దశబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సూదం నవీన్,సమీర్ ఫారూఖ్, ఆరిఫ్, హనుమంతు, రాజు తదితరులు పాల్గొన్నారు.