దోమకొండ, మార్చి 18 : మండలంలోని సంగమేశ్వర్‌లో ఎంపీపీ శారద, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్ సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఉపాధిహామీ నిధులు రూ.5లక్షలు, జిల్లా పరిషత్ నిధులు రూ. 3లక్షలతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ ఆదేశాల మేరకు గ్రామంలో నీటిఎద్దడి నివారణకు బోరుమోటరును ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నాగరాజు, సర్పంచ్ సుమలత, ఉపసర్పంచ్ రమేశ్, వైఎస్ ఎంపీపీ పుట్టబాపురెడ్డి, నిమ్మశంకర్, రంజిత్, ఆకుల లింగం, పెద్దబాల్రెడ్డి, సాయిలు, రాంచంద్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూర్ మండలం కంచర్లలో..
భిక్కనూర్, మార్చి 18 : మండలంలోని కంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ మట్ట చంద్రకళా మాధవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్లూరి హన్మంత్‌రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ బాపురెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేశ్, మాజీ సర్పంచులు చంద్రం, మహిపాల్, మాజీ ఉప సర్పంచ్ మాధవరెడ్డి, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఐలాపూర్‌లో..
లింగంపేట, మార్చి 18 : మండలంలోని ఐలాపూర్ గ్రామం లో ఉన్న ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ తుమ్మలపల్లి ధనలక్ష్మి ప్రారంభించారు. ఎంపీ లాడ్ నిధులు రూ. 5 లక్షలు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ. 5 లక్షలతో రోడ్డు పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు దేవేందర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీసాయిలు, టీఆర్ఎస్ నాయకులు సాయాగౌడ్, మల్లయ్య, పోశయ్య, రాములు, రఫీ క్, పంచాయతీ కార్యదర్శి ఫరీదాబేగం పాల్గొన్నారు.