బాన్సువాడ, మార్చి 13 : బాన్సువాడ డివిజన్ కేంద్రంగాలోని డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయానికి మొదటి సారి విచ్చేసిన ఎస్పీకి డీఎస్పీ సత్యనారాయణ గౌడ్ మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాల సిబ్బందితో సమీక్షించారు.
ఆయా మండలాల్లో కేసుల స్థితిగతులు, శాంతి భద్రతల పరిరక్షణ, సీసీ కెమెరాలు తదితర దొంగతనం కేసుల కేసుల వివరాలపై అరా తీశారు. డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మండల అశోక్, రూరల్ సీఐ రాజేష్, నస్రుళ్లబాద్ ఏస్ఐ లావణ్య, పట్టణ ఎస్ఐ అశోక్, మోహన్ తదితరులు ఉన్నారు.