నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు డీఈఈ శ్రావన్‌కుమార్ తెలిపారు. మొత్తం 12 వరద గేట్ల ద్వారా 85,200 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు(17.80 టీఎంసీలకు) గాను 1402.75 అడుగులు (14.64 టీఎంసీల) నీరు నిలువ ఉండగా ఎగువ భాగం నుంచి 61100 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని తెలిపారు.
మంజీరా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పంటలు మునిగిపోతున్నందున ఇన్‌ఫ్లో కంటే నీటి విడుదలను ఎక్కువగా విడుదల చేస్తున్నామని అన్నారు.