చకచకా అభివృద్ధి
సేకరించిన చెత్తతో ఎరువుల తయారీ
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
బీర్కూర్, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని జెట్టి కిష్టాపూర్ గ్రామం పల్లె ప్రగతి పనులను చకచకా పూర్తి చేసుకొని అందరిచేతా భేష్ అనిపించుకుంటున్నది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులను కల్పిస్తోందనడానికి ఈ గ్రామమే నిదర్శనం. హరితహారంలో భాగంగా గ్రామానికి రెండు వైపులా కిష్టాపూర్- బీర్కూర్, కిష్టాపూర్- బాన్సువాడ ప్రధాన రహదారి పక్కన నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర ప్రభుత్వ భవనాల ఆవరణల్లో నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులతో గ్రామం శివారులో వైకుంఠధామాన్ని నిర్మించారు. ట్రాక్ట ర్ ట్రాలీ ద్వారా గ్రామంలోని చెత్తను ఎప్పటికప్పుడు కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నా రు. అనంతరం తడి, పొడి చెత్తతో సేంద్రి య ఎరువులను తయారు చేస్తున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సౌకర్యం కల్పించారు. గ్రామ శివారులోని మూడు చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీయించడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం వివిధ రకాల మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతుండడంతో గ్రామంలోని అంతర్గత రోడ్లన్నీ పరిశుభ్రంగా మారాయి.
స్పీకర్ పోచారం సహకారంతో..
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతు న్నాయి. గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. పల్లె ప్రగతి నిధులతో సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు నిర్మించుకున్నాం. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తా.