కమ్మర్పల్లి/భీమ్‌గల్/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్‌నగర్)/బోధన్ రూరల్/ఆర్మూర్/సిరికొండ, ఆగస్టు 17: దోమల బెడదను నివారించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్ అన్నారు. కమ్మర్‌పల్లిలో డెంగీ సోకిన వారి ఇంటి పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. గ్రామ పంచాయతీలో కమ్మర్పల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. సర్పంచ్ స్వామి, పీహెచ్సీ వైద్యాధికారి స్వామి, సూపర్వైజర్ మారుతి, పీహెచ్ఎన్ సుల్తానా, విజయ, సబ్ యూనిట్ అధికారి సాయన్న తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు సుచరిత తెలిపారు. భీమ్‌గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు నర్సయ్య, గంగాధర్, లింగయ్య, లింబాద్రి, కో-ఆప్షన్ సభ్యుడు అజ్మత్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, నాయకులు నయీం, ఆశ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో దోమల నివారణకు స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలని ఎంపీడీవో రాజేశ్ అన్నారు. మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ లేదా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించాలని సర్పంచ్ బీమావతి భాను ప్రసాద్‌కు సూచించారు. ఎంపీ వో శివచరణ్, పంచాయతీ కార్యదర్శి భోజన్న, కారోబార్ సాయిరాం, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య సూచించారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సం దర్భంగా ఆమె డాక్టర్ జవేరియా సుల్తానా, డాక్ట ర్ వెంకటేశ్‌కు సూచనలు చేశారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాల్లో విధులు నిర్వహించే ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. దవాఖానా సిబ్బంది ఉన్నారు.
బోధన్ మండలంలోని సాలూరా గ్రామంలో డెంగీ వ్యాధిపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు ఉన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగాఉండాలని మండల వైద్యాధికారి మోహన్ సూచించారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీ పాలకవర్గసభ్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో సర్పంచ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేగాం వైద్యాధికారి భాస్కర్‌రావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచేలా చూడాలన్నారు. ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మి, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎన్ఎం గిరిజ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.