Kamareddy | విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : మంత్రులు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, చీకటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, చీకటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రులు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని సూచించారు.
విద్యార్థులకు పాఠ్యప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోనీ విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

