శక్కర్ నగర్ : బోధన్ పట్టణం ఆచన్ పల్లికి చెందిన షేక్ గఫార్ అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఆచన్ పల్లికి చెందిన సదరు వ్యక్తి మట్కా(Matka) నిర్వహిస్తున్నాడని అందిన సమాచారం మేరకు బోధన్ పట్టణ పోలీసులు షేక్ గఫార్ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.
గఫార్ వద్ద మట్కా జూదానికి చెందిన ఆధారాలు లభ్యం కావడంతో మంగళవారం న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఈ మేరకు గఫార్కు రెండు రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బోధన్ పట్టణంలో మట్కా జూదంతో పాటు ఏవైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.