కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి యంత్ర మూర్తి ప్రతిష్ట బుధవారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాధవానంద పీఠాధిపతి తోగుట రంగంపేట మాధవనంద సరస్వతి మహాస్వామి పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన కార్యక్రమంలో వేద పురోహితులు గంగవరం ఆంజనేయ శర్మ,పండితుల ఆధ్వర్యంలో శాంతి పాఠము, నాదస్వరం, గురుప్రార్థన, గోపూజ, స్థాపిత దేవతా ప్రాతఃకాల పూజ, జప-పారాయణములు, నవగ్రహాది మండల దేవతా-మంత్ర-ప్రధాన దేవతామంత్ర, మూర్తి-మూర్త్యధిపతి-లోక పాల దేవతా మంత్ర హవనములు, వ్యాహృతి హోమాలు, మూర్తుల జలోద్వాసనము, నేత్రోన్మీలనము, మహాస్నపనము, ధాన్యాధివాసము, శిఖర, ధ్వజ-సంస్కారములు, శాంతిక పౌష్టిక, అఘోర, వ్యాహృతి – న్యాస హోమాలు, శయ్యాధివాస, షోడశన్యాస, ప్రాసాదసంస్కార, ప్రాసాదోత్సర్జన, పూజాయజ్ఞములు నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.