Tirumala Laddu | దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు : చంద్రబాబు
Tirumala Laddu | తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి : తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ( Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan) , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ ( Madhav ) బుధవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.
తిరుమల పవిత్రతను కాపడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. లడ్డూ విషయంలో సీబీఐ పంపిన నివేదిక ఆధారంగా ఏక సభ్య కమిషన్‌ను వేసి అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారాన్నిజోడిస్తామని పేర్కొన్నారు. తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, బూతులు తిట్టినా భరించలా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామని అన్నారు.
వైసీపీ నాయకులకు దేవుడంటే లెక్కలేనితనమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదని వస్తే ప్రజలను అప్రమత్తం చేస్తారని అన్నారు. అంతకుముందు పలువురు మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు.
లడ్డూ తయారీలో మహాపాపం చేసి ఎదురుదాడి చేస్తుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులు డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన తరువాతనే దర్శనానికి అనుమతి ఉంటుందని, వైఎస్ జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలంటే ఎందుకు చేయరని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం సంతకం పెట్టి దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

