వేల్పూర్/ మెండోరా, మే 2: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మం డలం కుకునూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.75లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, మెండో రా మండల కేంద్రంలో రూ.27 లక్షలతో చేపట్టనున్న అదనపు గదులు, ప్రహరీ నిర్మాణం, ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఉన్నత పాఠశాలలో రూ. 34 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమ వారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మెండోరాలో రూ. 40 లక్షల నిధులతో వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి వేముల మాట్లాడారు. కాన్వెంట్ స్కూల్లో ఎలాంటి సౌకర్యాలతో ఆంగ్ల బోధన ఉంటుందో వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మన ఊరు-మన బడి ఎంతో గొప్ప కార్యక్రమమని, దీనిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్నత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను మంత్రి పరిశీలించారు.పాఠశాలలో సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
విద్వేషాలను రెచ్చగొట్టడం హైందవ ధర్మం కాదు
ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం హైందవ ధర్మం కాదని మంత్రి వేముల అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించడమే హైందవ ధర్మమన్నారు. నియోజకవర్గంలో గడిచిన ఏడేండ్లలో అనేక ఆలయ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందన్నా రు. కొన్ని దుష్ట శక్తు లు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని రేపుతున్నాయన్నారు. ప్రజలు ఏది మంచో, చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశం లో అభివృద్ధి చెందిన పది గ్రామాలను ఎంపిక చేసేందుకు చేపట్టిన సర్వేలో పదికి పది తెలంగాణ రాష్ట్ర గ్రామాలే కావడం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఎంపికైన టాప్10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవేనని కావడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. ఇందులో నిజామాబాద్ జి ల్లా నుంచి నాలుగు గ్రామాలు ఎంపికవగా, బాల్కొండ నియోజకవర్గంలో కుకునూర్ గ్రామం ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పునరుజ్జీవ పథకంతో సాగునీటికి ఢోకాలేదు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ వరద ఆయకట్టుకు ఢోకా లేకుండా పునరుజ్జీవ పథకం దోహదపడిందని మంత్రి వేముల అన్నారు. ఎన్ని పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా గ్రామాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలని కోరా రు. కాకతీయ కాలువలో 360 రోజులు నీరు ఉండేలా పునరుజ్జీవ పథకాన్ని ప్రారంభించామన్నారు. దీంతో వరద, కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ఆ యకట్టుకు రెండు పంటలకు ఢోకా లేదన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రతి గ్రామంలోని పాఠశాలలను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామన్నారు.
బడులు బాగుంటేనే విద్యార్థుల భవిష్యత్తు, చదువులు బాగుంటాయన్నారు. కుకునూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాం విజయ, ఎంఈవో వనజారెడ్డి, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు పాల్గొన్నారు. మెండోరాలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ తలారి గంగాధర్, స ర్పంచులు మచ్చర్ల రాజారెడ్డి, సామ గంగారెడ్డి పాల్గొన్నారు. రెంజర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఎం పీ పీ సామ పద్మ, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ, వైస్ ఎంపీపీ ఆకుల రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, సర్పంచ్ రాజారెడ్డి పాల్గొన్నారు.