మహిళల సంక్షేమానికి ప్రభుత్వ కృషి
నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్
ఖలీల్‌వాడి, మార్చి 5: చిన్నారులకు మొదటి గురువు అంగన్వాడీ టీచర్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. శనివారం నగరంలోని న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్న తల్లి స్థానంలో ఉండి చిన్నారుల అలనాపాలన చూసుకునే మంచి నేస్తం అంగన్వాడీ టీచర్ అని అన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్ దం డు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి కృషి: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
సిరికొండ, మార్చి 5: మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను సన్మానించాలని బాజిరెడ్డి సూచించారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీలా శ్రీరాములు, ఎంపీపీ మలావత్ సంగీత, జడ్పీటీసీ మాన్సింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.