నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వివిధ సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కామారెడ్డి పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ పూలమాల వేసి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ నివాళులర్పించారు. గ్రంథాలయ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, స్పీకర్ వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. దళితవాడలో నాయకులు ఎం.సాయిలు, ముక్కగల్ల సాయిలు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు పోచిరాం, కే.సాయిలు, ముక్కగల్ల ప్రసాద్, దొబ్బల గంగారాం, వై.సాయిలు, కే. లచ్చిరాం, వై.పురుషోత్తం, మోహన్ నివాళులర్పించారు.
నిజాంసాగర్, పెద్దకొడప్గల్, జుక్కల్ మండలాల్లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పెద్దకొడప్గల్లో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, జుక్కల్ తహసీల్ కార్యాలయంలో సిబ్బంది, నిజాంసాగర్ మండలం తెల్గాపూర్లో సర్పంచ్ నారాయణ తదితరులు నివాళులర్పించారు. మద్నూర్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచులు సురేశ్, గఫార్, రాజుపటేల్, శాంతేశ్వర్, విఠల్ గురూజీ, ఎంకే పటేల్, మధుకర్, ఎంపీటీసీలు దీన్‌దయాల్, విజయ్, సాయిలు, రాములు తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జడ్పీటీసీ భారతీ రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, ఎంపీపీ అశోక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణం, లింగారెడ్డిపేట్ గ్రామంలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు.
నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, బత్తిని దేవేందర్, మర్రి బాల్కిషన్, బాలరాజు, సతీశ్, రాజేశ్, ఓంకార్నాయక్, వంగపల్లి కాశీనాథ్, గణేశ్, నాగుల యాదగిరి, సత్యం, గజానంద్, గోపి, జనార్దన్‌రెడ్డి, హఫీజ్పటేల్, పరంధాములు, కాశీరాం, రవినాయక్, నారాయణరెడ్డి, పద్మారావ్, అబ్దుల్ రజాక్, శివనందన్, సాయిలు, జీవన్, పోచయ్య, ప్రసాద్ విఠల్, సాయిలు పాల్గొన్నారు. లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. నాగిరెడ్డిపేట్ మండల పరిషత్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎంపీపీ రాజదాస్, ఎంపీడీవో రఘు, ఎంపీటీసీలు నారాయణ, విమలవ్వ, మాధవి, సిబ్బంది నివాళులర్పించారు. తాడ్వాయి మండలంలో వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులు జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. గాంధారి మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దుర్గం గ్రామంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ సకారాం, తుకారాం, ప్రేమ్‌దాస్, రవి, సాయులు, శివలాల్ నివాళులర్పించారు.
నస్రుల్లాబాద్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, సర్పంచ్ అరిగె సాయిలు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, నాయకులు మల్లేశ్, వెంకట్, నర్సింహులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో సర్పంచులు సరళ, నారాయణరెడ్డి, బోనాల సుభాష్, శ్రావణ్‌కుమార్, ఉప సర్పంచులు సాయిలు, మంద శ్రీనివాస్, అక్బర్, నాయకులు పీర్యానాయక్, సుభాష్, శ్రీనివాస్‌రెడ్డి, కొండ వెంకటేశం పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని అన్ని గామాల్లో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను సర్పంచుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బీబీపేట్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలమణి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, ఐడీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, నాయకులు భూమేశ్, నర్సింహులు నివాళుల ర్పించారు. భిక్కనూరులో ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మా నాగభూషణంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రామచంద్రం, మాజీ సర్పంచ్ బండి రాములు, బోన్ల శేఖర్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.