స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ బాలరాజుతో కలిసి లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ
నస్రుల్లాబాద్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో కలిసి శనివారం నస్రుల్లాబాద్ మండలకేంద్రంలో 48మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 7.61లక్షలమంది గొల్లకురుమలకుగాను మొదటివిడతలో సుమారు 3.88లక్షలమందికి 75శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసినట్లు స్పీకర్ తెలిపారు. ఒక్కో యూనిట్లో 21 గొర్రెలను అందజేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో 48 మంది గొల్ల, కుర్మ లబ్ధిదారులకు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌తో కలిసి గొర్రెల యూనిట్లను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7లక్షల 61వేల 869 గొల్ల, కుర్మలకు గాను మొదటి విడుతలో రూ.3 లక్షల 88వేల మందికి గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. గత పాలకులు గొల్ల, కుర్మలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ గ్రామాల వారీగా సహకార సంఘాలను ఏర్పాటు చేయించి ఒక్కో కుటుంబానికి 21 గొర్రెలతో కూడిన యూనిట్లను 75 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, విండో చైర్మన్లు గంగారాం, మారుతి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.