లింగంపేట/ తాడ్వాయి/బిచ్కుంద, మార్చి 12 : లింగంపేట మండలకేంద్రంలోని దాసరివాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కన్నాపూర్ తండాలో రోడ్డు పనులను సర్పంచ్ గోవింద్ ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సురేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లింగంపేట సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు షమీమున్నీసా బేగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు యూసుఫ్, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు నరేశ్, పట్టణ అధ్యక్షుడు సాయిరాం, యూత్ అధ్యక్షుడు సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యురాలు రాజమణి ప్రారంభించారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో రోడ్ల నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరైనట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింహులు, ఆర్గోండ విండో చైర్మన్ శివరాములు, నాయకులు సాయిరెడ్డి, బాలయ్య, రవీందర్, మనోహర్‌రావు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం రాజోళ్ల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ అశోక్ పటేల్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
నిజాంసాగర్, మార్చి 12 : పెద్దకొడప్గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ చంద్రబాయి శనివారం ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ. 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శిల్ప, ఎంపీటీసీ సభ్యుడు నాందేవ్, నాయకుడు నారాయణ పాల్గొన్నారు.