బోధన్‌కు చేరుకున్న వైద్య విద్యార్థి నిజాముద్దీన్
బోధన్, మార్చి 12: ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన బోధన్‌కు చెందిన ఎండీ నిజాముద్దీన్ శనివారం తెల్లవారు జామున స్వగ్రామానికి సురక్షితంగా చేరుకున్నాడు. ఉక్రెయిన్‌లోని సుమీ నేషనల్ యూనివర్సిటీలో వైద్య విద్య మొదటి సంవత్సరం చదువుతున్న నిజాముద్దీన్ యుద్ధవాతావరణం కారణంగా అక్కడే చిక్కుకు పోయాడు. సుమీ ప్రాంతంలో సైతం రష్యా దాడులు చేయడంతో కొంత భయం కలిగినా, తల్లి రజియాబేగంతో నిత్యం మాట్లాడుతూ ధైర్యం చెప్పిన నిజాముద్దీన్ ఎట్టకేలకు తన స్వస్థలానికి చేరుకున్నాడు. తన కుమారుడు సురక్షితంగా రావడానికి సహకరించిన ఇండియా ఎంబసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తనతో నేరుగా మాట్లాడి, ధైర్యం చెప్పడంతో పాటు సహకరించిన ఎమ్మెల్సీ కవితకు నిజాముద్దీన్ తల్లి రజియాబేగం కృతజ్ఞతలు తెలిపారు.