నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. మూడోరోజు ఆదివారం గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. జుక్కల్ మండలం పెద్దగుల్ల గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి పనులు చేపట్టారు. పనులను ఎంపీపీ రాజదాస్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్ పర్యవేక్షించారు. లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మొక్కల పెంపకానికి స్థలాల గుర్తింపు, విద్యుత్ సమస్యల పరిష్కారం తదితర పనులు చేపట్టారు.
భవానీపేట, ముంబాజీపేట, జల్దిపల్లి గ్రామాల్లో మండలస్థాయి అధికారులు పర్యటించారు. మండల కేంద్రంలో మురికి కాల్వలు శుభ్రం చేయడంతోపాటు మల్టీ లేయర్లో మొక్కలు నాటడానికి స్థలాలను అధికారులు గుర్తించారు. పిట్లం మండల కేంద్రంతోపాటు, కంభాపూర్, చిన్నకొడప్గల్, రాంపూర్ గ్రామాల్లో సర్పంచులు పారిశుద్ధ్య కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు. మండలకేంద్రంలో సర్పంచ్ విజయలక్ష్మి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఉన్నారు. బిచ్కుంద మండలం మన్యాపూర్లో ఎంపీడీవో ఆనంద్ పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాములు, ఎంపీవో మహబూబ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు మురికి కాలువలను శుభ్రం చేయించారు. పలు వార్డుల్లో పనులను మున్సిపల్ కమిషనర్ జీవన్ పర్యవేక్షించారు. తాడ్వాయి మండల కేంద్రంతోపాటు దేమెకలాన్, బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి గ్రామాల్లో మురికికాలువలను శుభ్రం చేశారు. సర్పంచులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంలో పల్లెప్రగతి పనులను బాన్సువాడ డీఎల్పీవో శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో రాధ, ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ బోనాల సుభాష్ పర్యవేక్షించారు. ఇబ్రహీంపేట్‌లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తాడ్కోల్‌లో సర్పంచ్ కుమ్మరి రాజమణి చెత్తకుప్పల తొలగింపు పనులను పర్యవేక్షించారు. బోర్లం, కోనాపూర్, పులిగుండుతండా, దేశాయిపేట్, పోచారం, రాంపూర్‌తండా, తిర్మాలాపూర్ తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను కొనసాగుతున్నాయి.నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లిలో ఎంపీవో రాము పారిశుద్ధ్య పనులకు పరిశీలించారు.
రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్‌లో డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతి వనం, శ్మశాన వాటికలను డీపీవో శ్రీనివాస్‌రావు పరిశీలించారు. డీఎల్పీవో సాయిబాబా ఎంపీవో, ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ మంజులారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతి , వార్డు సభ్యులు పాల్గొన్నారు. బీబీపేట్ మండలంలోని మాందాపూర్‌లో పనులను ఎంపీవో కృష్ణ పరిశీలించారు. జీపీ కార్యదర్శి నవీన్‌కు సూచనలు చేశారు. సిబ్బంది పాల్గొన్నారు. గాంధారి మండల కేంద్రంలో సర్పంచ్ మమ్మాయి సంజీవులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఎంపీడీవో సతీశ్, ఉప సర్పచ్ రమేశ్, వార్డు సభ్యులు ఉన్నారు. బీర్కూర్ మండలంలోని బరంగేడ్గిలో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులను పంచాయతీ కార్యదర్శి వినోద్ రాథోడ్ పరిశీలించారు. టీఆర్‌యస్ నాయకులు పసుపుల రమేశ్, కుమ్మరి గంగారాం తదితరులు పాల్గొన్నారు.