బాన్సువాడ టౌన్, మార్చి 6 : నియోజకవర్గంలో గూడులేని ప్రతి పేద కుటుంబానికీ డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణలోని 4వ వార్డులో కొనసాగుతున్న 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. నాణ్యతతో నిర్మించి లబ్ధిదారులకు త్వరగా అందజేయాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్కు సూచించారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణగుప్తా, కౌన్సిలర్ రుక్మిణి, నాయకులు ఎజాజ్, వెంకట్రాంరెడ్డి ఉన్నారు.
బంగారు పోచమ్మ ఆలయంలో పూజలు
పట్టణలోని పీఎస్ఆర్ బీడీ వర్కర్స్ కాలనీలో ఉన్న బంగారు పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో స్పీకర్ పోచారం పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మ దయతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మోతీలాల్, నాయకులు పాల్గొన్నారు.