Kamareddy | చేర్యాల : ప్రతి కల్లు దుకాణంలో 6 సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కామారెడ్డి ఏఎస్సీ చైతన్య రెడ్డి ఆదేశించారు. అలాగే 18 ఏండ్ల లోపు పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ కల్లు దుకాణంలోకి అనుమతించకూడదని హెచ్చరించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏరియాలోని కల్లు కాంపౌండ్ల యజమానులతో కామారెడ్డి ఏఎస్సీ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు.
మైనర్లకు కల్లు విక్రయించకూడదని కల్లు కాంపౌండ్ యజమానులను ఆదేశించారు. కల్లు కాంపౌండ్లో పిల్లలు కనిపిస్తే సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశానికి కామారెడ్డి పట్టణ, ఇతర మండలాల నుంచి వివిధ కల్లు కాంపౌండ్ల యజమానులు హాజరయ్యారు.