కామారెడ్డి జిల్లా బిబిపేట్ (దోమకొండ) : పంచాయతీ ద్వారా ఉప్పగడ్డ పరిరక్షణకు ఇచ్చిన అనుమతి ప్రకారం పనులు ఎంత వరకు జరిగాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలనకు వచ్చారు. ఈ ఉప్పగడ్డ ఇక చారిత్రాత్మక వారసత్వ సంపద అని, దీనిని పరిరక్షించుకొనే బాధ్యత మన అందరిదని, ఈ భూభాగం పంచాయతీ పరిధిలోనిది కాబట్టి పంచాయతీ వారు ఇచ్చిన అనుమతులను తక్షణమే అమలు పరచమని మండల అధికారికి సూచించారు.
మండల అధికారి ప్రవీణ్ కుమార్.. పంచాయతీ, గ్రామసభ తీర్మానం ప్రకారం పనులు జరిగాయని, తద్వారా జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకే పంచాయితీ వారు సంభందిత ఆదేశాలు జారీచేశారని తెలియజేశారు. మండల అధికారి, పంచాయతీ కార్యదర్శి మరో మారు చర్చించి ఉపగడ్డ పరిరక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. అలాగే ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్, నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ హౌస్‌ను శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.