ఎడపల్లి(శక్కర్‌నగర్), సెప్టెంబర్ 29: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ద్ధికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ రైతువేదిక భవనంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని అలీసాగర్ చెరువు నీటిని విడుదల చేయడంతో పంటపొలాలకు ఇబ్బందిగా మారుతున్నదని పలు గ్రామాల రైతులు చేసిన విజ్ఞప్తిలో భాగంగా అదనపు గేట్లు ఏర్పాటు చేసే విషయంలో ఇప్పటికే సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులకు సూచించామన్నారు. ఎమ్మెల్యే షకీల్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకారంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలో భాగంగా రైతులు పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. వాణిజ్య పంటలు సాగుచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ విషయమై ఇప్పటికే మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడామని చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, బోధన్ ఏఎంసీ చైర్పర్సన్ వాగ్మారే అర్చనా సూర్యకాంత్, రాజిరెడ్డి, మండల వ్యవసాయాధికారి సిద్ధిరామేశ్వర్, రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు, ఎంపీడీవో శంకర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ పొట్టోల్ల సాయిలు, ఎంపీటీసీ మంద సంజీవ్, ఎంఎస్సీ ఫారం సర్పంచ్ విజయ్‌కుమార్, నాయకులు ఆకుల శ్రీనివాస్, రవీందర్ గౌడ్, ఎం.ఎల్లయ్య యాదవ్, ఆయిటి సాయారెడ్డి, పిట్ల సాయిలు, కమలాకర్‌రెడ్డితో పాటు జానకంపేట్, పోచారం, జైతాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి..
ఏర్గట్ల/భీమ్‌గల్, సెప్టెంబర్ 29: ఏర్గట్ల మండలంలోని తొర్తి, తడ్పాకల్ గ్రామాల్లో రైతులకు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు బుధవారం అవగాహన కల్పించారు. ఏవో అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్, నూనె గింజల పంటలను సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యానశాఖ అధికారి రోహిత్ బొప్పాయి పంటపై అవగాహన కల్పించారు. ఏఈవోలు స్నేహ, సాయి సచిన్, సర్పంచులు ప్రకాశ్, నవీన్, ఉపసర్పంచులు అశోక్, తాహెర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్ర అశోక్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
యాసంగిలో వరి పంటకు బదులుగా మార్కెట్లో డి మాండ్ ఉన్న ఆరుతడి పంటలను పండించాలని భీమ్‌గల్ రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్ అన్నా రు. మండలంలోని పురాణీపేట్, దేవన్‌పల్లి, కారేపల్లి గ్రా మాల్లో రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి లక్పతి, సర్పంచ్ తోట శంకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొన్కంటి నర్సయ్య, ఎంపీటీసీ సాయి ప్రసన్న, నియోజకవర్గ సమన్వయ సభ్యులు గుణ్వీర్రెడ్డి, తుక్కాజీనాయక్, గంగాధర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు గాంధీ, ఉపసర్పంచ్ రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ దేవేందర్, రైతులు పాల్గొన్నారు.