పిట్లం, జూన్ 28: సీఎం కేసీఆర్ నాయకత్వంలో జుక్క ల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, పాలకవర్గసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి మార్కెట్ కమిటీ కార్యాలయంలో పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బ్లూబెల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పిట్లం-నిజాంసాగర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీబాయి, వైస్ చైర్మన్‌గా గైని విఠల్, పాలకవర్గసభ్యు లు మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, తండాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారని అన్నారు.
గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు మేలు చేసేలా మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పని చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్‌రాజు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ల సౌకర్యంతోపాటు పాలకవర్గంలో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, ఆలిండియా బంజారా సంఘం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బాబుసింగ్, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, విండో చైర్మన్లు నారాయణరెడ్డి, శపథంరెడ్డి, వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నిజాంసాగర్, పిట్లం మండలాల అధ్యక్షులు సత్యనారాయణ, వాసరి రమేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.