
కామారెడ్డి టౌన్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు గౌరవ వేతనం విడుదల చేసినట్టు కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సాయన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకుగాను 525 గ్రామాల సర్పంచులకు 78 లక్షల 90 వేల రూపాయలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి తండా గ్రామ పంచాయతీకి సర్పంచ్ లేడని, దీంతో నిధులు విడుదల కాలేదని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదల అయ్యిందని పేర్కొన్నారు.